telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

పవన్ పై ప్రత్యేక సంచిక.. సోషల్ మీడియాలో పంచుకున్న జనసేన

pawan-kalyan

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ఓ తెలుగు దినపత్రిక భారీ కథనం ప్రచురించింది. ఇటీవలే ప్రస్థానం ఆరంభించిన న్యూస్ 99 మీడియా సంస్థ పవన్ పై ప్రత్యేక సంచిక తీసుకువచ్చింది. అటు సినిమాల్లోనూ, ఇటు రాజకీయాల్లోనూ ఎప్పుడూ ప్రత్యేకమే! సినీ రంగంలో తనదైన ముద్రవేసిన ఈ మెగా కుటుంబసభ్యుడు పవన్ కల్యాణ్ పై ప్రత్యేక కథనం వెలువరించింది.

రాజకీయాల్లోనూ తన ప్రభావం చూపించేందుకు తహతహలాడుతున్నాడు. తాజాగా, ఈ జనసేన పార్టీ అధినేతపై ‘తరతరాల నిశీధి దాటే చిరు వేకువ జాడతడే!’ అనే శీర్షికతో వచ్చిన ఈ కథనాన్ని జనసేన పార్టీ వర్గాలు సోషల్ మీడియాలో పంచుకున్నాయి.

Related posts