కర్నాటక లోని మాండ్య లోక్‌సభ స్థానం నుంచి దివంగత అంబరీష్ భార్య, సినీనటి సుమలత, ముఖ్యమంత్రి కుమారస్వామి కుమారుడు నిఖిల్ గౌడ పోటీకి దిగడంతో అక్కడ ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ క్రమంలో సుమలత ఫేస్‌బుక్ పేజ్ బ్లాక్ అయ్యింది. దీంతో ఆమె మళ్లీ కొత్త ఖాతాను ప్రారంభించారు. తన కొత్త ఫేస్‌బుక్ ఖాతా లింక్‌ను షేర్ చేస్తూ సుమలత ట్వీట్టర్ వేదికగా ముఖ్యమంత్రి కుమారస్వామిపై విరుచుకుపడ్డారు.
జేడీఎస్ నేతలు కుళ్లు రాజకీయాలు చేసి, తన ఖాతాను డిలీట్ చేశారని సుమలత పేర్కొన్నారు. గుర్తు తెలియని వ్యక్తులు నా ఫేస్‌బుక్‌ను హ్యాక్ చేసి బ్లాక్ చేశారని ఆమె ఆరోపించారు. ఫేస్‌బుక్ వేదికగా తాను మాండ్య ప్రజలతో మాట్లాడేదాన్నని, నా ప్రణాళికలు వారితో పంచుకునేదాన్నని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.ఫేస్‌బుక్ పేజీని పునరుద్దరించడానికి తమ సాంకేతిక బృందం కృషి చేస్తోందని. తెలిపారు. ఎన్నికల సమయంలో ఇలాంటి చెత్త పనులతో ప్రజల్ని తప్పుదోవ పట్టించలేరన్నారు. జేడీఎస్ ఎంత భయంకరమైనదో ఈ సంఘటన ద్వారా నిరూపించబడిందని ఆమె వ్యాఖ్యానించారు.