telugu navyamedia
ట్రెండింగ్ సామాజిక

ఈ బామ్మ డ్యాన్స్ చూశారంటే… ఎవరైనా వారెవ్వా అనాల్సిందే…!!

nude dances in hyderabad clubs

సాధారణంగా వృద్ధులు 60 ఏళ్ళు వచ్చేసరికి రామా కృష్ణా అంటూ కాలం గడిపేస్తుంటారు. కానీ అరవై ఏళ్లు పైబడిన మహిళ ఉత్సాహంగా చేసిన డ్యాన్స్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో ప్రస్తుతం ట్రెండింగ్ అవుతోంది. ఈ వీడియోలో ఓ వృద్దురాలు కుర్రకారులా ఉర్రూతలూగుతూ తెగ ఆనందంగా డ్యాన్స్ చేయడం చూడవచ్చు. చుట్టు పక్కల వారు ఈమె డ్యాన్స్‌ను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అది కాస్తా వైరల్ అయిపోయింది. వీడియో పెట్టిన కొన్ని వారాల్లోనే దాన్ని దాదాపు నాలుగు కోట్ల మంది చూశారంటే.. ఈ వీడియో ఎంతలా ట్రెండ్ అయిందో అర్థం చేసుకోవచ్చు. బ్యాక్‌గ్రౌండ్‌లో వస్తున్న ఇంగ్లీషు పాటలకు బామ్మ కేరింతలు కొడుతూ డ్యాన్స్ చేసి అక్కడున్న వారందరినీ ఆనందింపచేసింది. వీడియోలో బామ్మ డ్యాన్స్‌కు నెటిజన్లు సైతం ఫిదా అయిపోయారు. కాగా ఈ వీడియో టర్కీలో తీసినట్టుగా తెలుస్తోంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related posts