telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

క్రాక్ నుంచి యమ్మీ యమ్మీ మాస్ బిర్యానీ

మాస్ మహారాజా ర‌వితేజ‌, డైరెక్టర్ గోపీచంద్ మ‌లినేని కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న మూడో చిత్రం ‘క్రాక్‌’. ఇదివ‌ర‌కు ఈ ఇద్దరి క‌ల‌యిక‌లో వ‌చ్చిన ‘డాన్ శీను’, ‘బ‌లుపు’ సినిమాలు విజయాలను అందుకున్నాయి. ఇప్పుడు వీరిద్దరూ హ్యాట్రిక్‌పై క‌న్నేశారు. తెలుగు రాష్ట్రాల్లో జ‌రిగిన కొన్ని య‌థార్థ ఘ‌ట‌న‌ల ఆధారంగా రూపొందుతోన్న ‘క్రాక్’ మూవీలో శ్రుతి హాస‌న్ నాయిక‌గా న‌టిస్తున్నారు. ప్రముఖ త‌మిళ న‌టులు స‌ముద్రక‌ని, వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్ ప‌వ‌ర్‌ఫుల్ క్యారెక్టర్లు పోషిస్తున్నారు. దేవీ ప్రసాద్, చిరగ్ జాని, మౌర్యని, సుధాకర్ కోమాకుల, వంశీ చాగంటి ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. స‌ర‌స్వతి ఫిలిమ్స్ డివిజ‌న్ బ్యాన‌ర్‌పై బి. మ‌ధు నిర్మిస్తోన్న ఈ చిత్రానికి ఎస్‌. త‌మ‌న్ సంగీతం స‌మ‌కూరుస్తున్నారు. ‘మెర్సల్‌’, ‘బిగిల్’ వంటి బ్లాక్‌బ‌స్టర్ సినిమాల‌కు ప‌నిచేసిన జి.కె. విష్ణు సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. అయితే.. ఈ క్రాక్‌ మూవీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌యింది. సంక్రాంతి సందర్భంగా జనవరి 9న క్రాక్‌ రిలీజ్‌ కానుంది. ఇక ఈ సినిమా నుంచి తాజాగా మరో సాంగ్‌ను రిలీజ్‌ చేశారు. మాస్‌ బిర్యానీ పేరుతో విడుదలైన ఈ సాంగ్‌ ట్రెండీగా ఉంది. కాసర్ల శ్యామ్‌ రాసిన లిరిక్స్‌ చాలా అట్రాక్టీవ్‌గా ఉన్నాయి. మాస్‌ సాంగ్స్ పెట్టింది పేరైన కాస్లర్ల శ్యామ్‌ మరోసారి తన పెన్ను పవర్‌ను చూపించాడు. రాహుల్‌ నంబియార్‌, సాహితి చాగంటి ఈ పాటను పాడారు. ఇక ఎస్‌ ఎస్‌ థమన్‌ అందించిన సంగీతం మరోసారి ట్రెండ్‌కు తగ్గట్టుగా సాగింది.

Related posts