telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

ఇక్కడ డబ్బులు చెట్లకే కాస్తున్నాయ్…!!?

Tree

సాధారణంగా చాలామంది ఎప్పుడో ఒకసారి డబ్బులేమైనా చెట్లకు కాస్తున్నాయా ? అనే డైలాగ్ ను వాడే ఉంటారు. అయితే ఇంగ్లాండ్ లో మాత్రం చెట్లకు నిజంగానే డబ్బులు కాస్తున్నాయి. ఈ వింత ఏంటో తెలుసుకుందాం… ఇంగ్లండ్‌లోని ఉడ్‌ల్యాండ్‌లో చాలా చోట్ల నాణేలతో నిండిన వృక్షాలు కనిపిస్తుంటాయి. ఒకటో రెండో కాదు వేలాది నాణేలు చెట్ల బెరడుపై అతుక్కుని ఉంటాయి. చెట్టులోనుంచి పొడుచుకుని వచ్చి అచ్చంగా ఆ చెట్టుకి కాసినట్టే కనిపిస్తాయి. అందుకే వీటిని ‘మనీ ట్రీ’ అని పిలుస్తారు. అయితే ఈ చెట్లకున్న నాణేలన్నీ మనుషులు పెట్టినవే. ఈ చెట్ల మొదళ్లు, కొమ్మలు, బెరడులు.. ఆ చెట్టుకి ఎక్కడ చూసినా రకరకాల దేశాలకు చెందిన నాణేలు నిండి ఉంటాయి. దీనికి కారణం ఏంటంటే… ఇంగ్లాండ్‌లో వందల ఏళ్ల క్రితం అప్పటి స్థానికులు కొన్ని రకాల వృక్షాల్లో చిల్లర డబ్బులు ఉంచితే అదృష్టం కలిసివస్తుందనీ, ఈ చెట్లలో ఉన్న ఆత్మలు సంతోషించి తమ కోరికలు తీరుస్తాయనీ నమ్మేవారు. అయితే ఈ విషయంపై ఇప్పటికీ అనేక పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. నదుల్లో డబ్బులు వేస్తేనే ఆ నాణేలు వరద ఉధృతికి ఈ చెట్లల్లో ఇరుక్కున్నాయని కొందరంటుంటే, లేదు చెట్లకే నాణేలు గుచ్చారని మరికొందరు వాదిస్తున్నారు. ఇప్పటికీ ఈ చెట్లపై ఉన్నాయని భావించే దైవ సంబంధ ఆత్మల ప్రీతి కోసం స్థానికులు క్రిస్మస్ రోజు మిఠాయిలు, బహుమతులు ఉంచుతారు. ఒకప్పటి నమ్మకాలను గౌరవిస్తూ నేటికీ వీటిని పరిరక్షిస్తున్న స్థానిక ప్రభుత్వాన్ని పర్యటకులు అభినందిస్తున్నారు.

Related posts