telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“బాబు చంపేస్తాడు…” కమ్మరాజ్యంలో కడప రెడ్లు నుంచి మరో సంచలనం

KRKR

వివాదాస్పద చిత్రాలు, కామెంట్స్ తో వార్తల్లో నిలిచే సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ “కమ్మరాజ్యంలో కడప రెడ్లు” అనే సినిమా తీయబోతున్నట్లు సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. క్యాస్ట్ ఫీలింగ్ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబందించిన అప్డేట్ తోనే ఆర్జీవీ షాకిస్తున్నాడు. కాంట్రవర్సీ క్రియేట్ చేయడంలో రామ్ గోపాల్ వర్మ స్టైలే వేరు. ఇప్పటికే “కమ్మరాజ్యంలో కడపరెడ్లు” అనే టైటిల్‌తో కావాల్సినంత పబ్లిసిటీ తెచ్చుకున్న రామ్ గోపాల్ వర్మ.. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు పాత్రలను పోలిన లుక్స్ విడుదల చేసి సంచలనం క్రియేట్ చేసాడు. తాజాగా ఈ సినిమాలో “బాబు చంపేస్తాడు” అనే సాంగ్ రిలీజ్ చేసాడు.సిరాశ్రీ రాసిన ఈ పాటకు రవిశంకర్ సంగీతం అందిస్తే.. రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో పాడి రక్తి కట్టించాడు. గత కొన్నేళ్లుగా చంద్రబాబును టార్గెట్ చేస్తూ వచ్చిన రామ్ గోపాల్ వర్మ.. తాజాగా ఈ పాటలో మరోసారి బాబును టార్గెట్ చేసాడు. ఈ పాటలో చెంపమీద కొడితే తట్టుకోగలడు.. కాళ్ల మీద కొడితే నిలదొక్కోగలడు.. అదే అహం మీద కొడితే మాత్రం తట్టుకోవడం కష్టం. జగన్ అహం మీద కొట్టిన బాబుకు ఏపీ ముఖ్యమంత్రిగా ఇప్పటికే చుక్కలు చూపిస్తున్న సంగతిని ఈ పాటలో ప్రస్తావించాడు. దానికి ప్రతిగా చంద్రబాబు ఎవరి ఒదలడు అందరినీ చంపేస్తాడు అంటూ ఈ పాటను రాసాడు. తనకన్నా వయసులో చిన్న అయిన జగన్ మోహన్ రెడ్డి… చంద్రబాబుకు తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడాన్ని కూడా ఈ పాటలో ప్రస్తావించాడు. మీరు కూడా ఈ పాటను వీక్షించండి.

Related posts