telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం కేసీఆర్‌

Kaleshwaram kcr

తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టును ముఖ్యమంత్రి కేసీఆర్‌ శుక్రవారం జాతికి అంకితం చేశారు. తెలంగాణలోని వ్యవసాయ భూములను గోదావరి జలాలతో సస్యశామలం చేయాలన్న కేసీఆర్ సంకల్పం నెరవేరే దిశగా తొలి అడుగు పడింది. మహాద్భుత కట్టడంగా ఇంజనీరింగ్ నిపుణులు పేర్కొంటున్న కాళేశ్వరం ప్రాజెక్టు సరిగ్గా 11.23 గంటలకు జాతికి అంకితమైంది. అంతకుముందు శృంగేరీ పీఠం ఆధ్వర్యంలో దాదాపు రెండు గంటల పాటు జల సంకల్ప హోమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని కేసీఆర్ దంపతులు దగ్గరుండి నిర్వహించారు.

పూర్ణాహుతి సమయానికి తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, ఏపీ సీఎం జగన్, మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ హాజరయ్యారు. వీరితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అతిథులకు కాళేశ్వరం విశేషాలను స్వయంగా వివరించిన కేసీఆర్, ఆపై వారితో పాటు ప్రాజెక్టు వద్దకు వెళ్లారు. కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ, సుందిళ్ల రిజర్వాయర్లు, నీటి లభ్యత తదితరాలపై ఏర్పాటు చేసిన చాయా చిత్ర ప్రదర్శనను నేతలు తిలకించారు.

Related posts