telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అక్షయ్ కుమార్ చారిత్రాత్మక చిత్రం… అభిమానులకు బర్త్ డే ట్రీట్

Akshay-Kumar

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నేడు 52వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులకు పుట్టిన రోజు కానుకగా తను నటిస్తున్న చారిత్రాత్మక చిత్రం ‘పృత్విరాజ్’ సినిమా టీజర్‌ను ట్విట్టర్‌లో విడుదల చేశారు. అక్షయ్ టైటిల్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమా యశ్‌రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తుంది. చంద్రప్రకాశ్ ద్వివేది దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే ఏడాది దీపావళికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా అక్షయ్ మాట్లాడుతూ… “పుట్టిన రోజు సందర్భంగా నా జీవితంలో నటిస్తున్న ముఖ్యమైన సినిమాకు సంబంధించిన టీజర్ విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. పృత్విరాజ్ చౌహాన్ జీవితం ఆధారంగా తెరకెక్కనున్న ఈ చిత్రం నా జీవితంలోనే ప్రత్యేకం” అని అక్షయ్ అన్నారు. మీరు కూడా ఈ టీజర్ ను వీక్షించండి.

Related posts