telugu navyamedia
సినిమా వార్తలు

వైరల్ : విజయ్ దేవరకొండ చిన్నప్పటి వీడియో చూశారా?

Vijay Devarakonda

టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ చిన్నప్పటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మొదట ఓ అభిమాని ఓ వీడియోను పోస్ట్ చేస్తూ విజయ్ ను ట్యాగ్ చేస్తూ “ఈ బాలుడు విజయ దేవరకొండేనా…? నాకు తెలియడం లేదు” అని క్యాప్షన్ ఇచ్చి ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. ఈ వీడియోలో విజయ్ “అయితే చదువు మానేసి పుట్టపర్తికి వచ్చిన స్వామి వారు ఇక్కడ ఏం చేసేవారు టీచర్” అని షావుకారు జానకిని అడుగుతున్నాడు. ఈ వీడియో చూసిన విజయ్… స్పందిస్తూ తన చిన్నప్పటి విషయాలు బాగా ట్రెండ్ అవుతున్నట్లున్నాయని, ఈ బాలుడు కూడా స్టారే అంటూ ఆ వీడియో పోస్ట్ చేసిన అభిమానికి ధన్యవాదాలు తెలిపారు. దీంతో విజయ్ దేవరకొండ అభిమానులు కొందరు అతడి చిన్నప్పటి ఫోటోలను, వీడియోలను సేకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ “డియర్ కామ్రేడ్” చిత్రం చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు.

 

Related posts