అమరావతి : ఏపీ ఫిర్యాదుపై తెలంగాణ ఇరిగేషన్ ఈఎన్సీకి కేఆర్ఎంబీ లేఖ రాసింది. నాగార్జున సాగర్ డ్యామ్ నుంచి కేటాయింపులకు మించి నీటి వినియోగంపై కేఆర్ఎంబీ అభ్యంతరం వ్యక్తం చేసింది.
తెలంగాణ కేటాయింపుల నుంచి విడుదల చేసిన నీటిని తగ్గించుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకు సాగర్ నుంచి విడుదల చేసిన 9.9 టీఎంసీల నీటిని మొత్తం కేటాయింపుల నుంచి మినహాయించుకోవాలని తెలంగాణకు కేఆర్ఎంబీ సూచన చేసింది. వచ్చే సమావేశానికి దీనికి సంబంధించిన వివరాలను సమర్పించాలని తెలంగాణ ప్రభుత్వానికి కేఆర్ఎంబీ ఆదేశించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 26 నుంచి మే 31వ తేదీ వరకు 13.4 టీఎంసీల నీటిని విద్యుత్ ఉత్పత్తి పేరుతో తెలంగాణ ఏకపక్షంగా వినియోగించుకుందన్న ఏపీ అభ్యంతరాలకు వివరణ ఇవ్వాలని కేఆర్ఎంబీ ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల ఏడో తేదీలోగా కేఆర్ఎంబీ సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు స్పష్టం చేసింది.
తాను ఏ విచారణకైనా సిద్ధం: చింతమనేని