telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

కరోనా బీభత్సం… ఏపీలో అక్కడ లాక్ డౌన్ !

ఏపీలోనూ రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఏపీలో బుధవారం ఒక్కరోజే 1184 కరోనా కేసులు నమోదయ్యాయి. ఏపీలో కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతుండటంతో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. గుంటూరు జిల్లా భట్టిప్రోలు మండలంలో లాక్‌డౌన్‌ ప్రకటించారు. ఇవాళ్టి నుంచి వారం రోజుల పాటు లాక్‌డౌన్‌ అమలులో ఉండనుంది. కరోనా కేసులు అధికంగా పెరగడంతో లాక్‌డౌన్‌ ప్రకటించినట్లు తహసీల్దార్‌ శ్రవణ్‌కుమార్‌ పేర్కొన్నారు. లాక్‌డౌన్‌ సమయంలో ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు నిత్యావసరాల కొనుగోలుకు అనుమతి ఇస్తున్నట్లు వెల్లడించారు. వారం రోజుల తర్వాత పరిస్థితిని సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. కాగా..ఇప్పటికే ఏపీలో 9 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్  ప్రకారం రాష్ట్రంలో ఏపీలో కొత్తగా 1,184 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 9,01,989 కు చేరింది. ఇందులో 8,87,434 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 7,338 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనా కారణంగా నలుగురు మృతి చెందారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు కరోనాతో 7,217 మంది మృతి చెందారు. ఇకపోతే గడిచిన 24 గంటల్లో ఏపీలో 456 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు.

Related posts