telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

జమ్మూకశ్మీర్ విభజన .. దేశవ్యాప్తంగా .. అప్రమత్తత.. హైఅలర్ట్‌ …

indian cine industry supports modi decision

జమ్మూకశ్మీర్ పై భారతప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పాక్ గుర్రుగానే ఉంది. ఇక నుండి భారత సరిహద్దులలో, కశ్మీర్ లో తన పప్పులు ఉడకవని ఆ దేశానికి మోడీ నిర్ణయం చెప్పకనే చెప్పింది. దీనితో పాక్ ఎలాంటి దుస్సాహసానికి ఒడిగట్టినా తిప్పికొట్టడానికి వీలుగా నియంత్రణ రేఖ (ఎల్వోసీ) వెంబడి మన సైన్యం సర్వసన్నద్ధంగా ఉందని అధికారవర్గాలు తెలిపాయి. కశ్మీరులోయలో పాకిస్థాన్‌ అశాంతిని రేకెత్తించవచ్చని, హింసను ప్రజ్వలింపజేసేలా కుట్రలు పన్నవచ్చని, ఐఈడీ పేలుళ్లకు పాల్పడవచ్చని, ఫిదాయీ దాడులు జరిగే అవకాశం ఉందని అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి.

కేంద్ర ప్రభుత్వం, భద్రతా దళాలు మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. జాతీయ భద్రతా దళాలన్నింటికి సోమవారం హైఅలర్ట్‌ ప్రకటించింది. రాష్ట్రంలో శాంతి-భద్రతల పరిస్థితిని ఆ రాష్ట్ర గవర్నరు సత్యపాల్‌ మాలిక్‌ సమీక్షించారు. ఉత్తర కమాండ్‌ చీఫ్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ రణ్‌బీర్‌సింగ్‌, శ్రీనగర్‌ కేంద్రంగా పనిచేస్తున్న 15 కార్ప్స్‌ ‘జనరల్‌ ఆఫీసర్‌ కమాండింగ్‌’ లెఫ్టినెంట్‌ జనరల్‌ కేజేఎస్‌ థిల్లాన్‌ సోమవారం రాత్రి రాజ్‌భవన్‌కు వెళ్లి మాలిక్‌తో సమావేశమయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను వివరించారు.

Related posts