telugu navyamedia
సినిమా వార్తలు

లేడీ ఫ్యాన్ చేసిన పనితో చిరాకుపడ్డ సల్మాన్

Salman-Khan

సెలెబ్రెటీలకు అభిమానులు ఉండడం అనేది సాధారణ విషయమే. అయితే కొన్నిసార్లు స్టార్లకు ఆ అభిమానుల వల్లే ఇబ్బందులు తప్పవు. అయితే అభిమానం అనేది మితిమీరితే ఎలా ఉంటుందో సల్మాన్ కు తాజాగా ఎదురైన సంఘటనే నిదర్శనం. “‘హమ్ ఆప్కే హై కౌన్” సినిమా విడుదలై పాతికేళ్లు పూర్తవుతున్న సందర్భంగా రీసెంట్ గా ముంబైలో స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేశారు. ఈ షోకి చాలా మంది సెలబ్రిటీలు హాజరయ్యారు. బాలీవుడ్ స్టార్ సల్మాన్ కూడా ఈ స్క్రీనింగ్ కి హాజరయ్యారు. షో పూర్తైన తరువాత బయటకి వచ్చిన సల్మాన్ ని ఓ మహిళా అభిమాని బాగా ఇబ్బంది పెట్టేసింది. సెక్యురిటీని తప్పించుకొని నేరుగా సల్మాన్ దగ్గరకి వచ్చిన లేడీ ఫ్యాన్ అతడితో సెల్ఫీ తీసుకోవాలని అతడి చేయి పట్టుకొని లాగేసింది. ఆమె చర్యతో సల్మాన్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. వెంటనే బాడీగార్డ్స్ ఆమెని వెనక్కి లాగడంతో సల్మాన్ తేరుకున్నాడు. అతడి ముఖకవళికలు మారిపోయాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీసల్మాన్ ప్లేస్ లో మరెవరైనా ఉంటే సీరియస్ అయ్యేవారని.. భాయ్ కోపాన్ని కంట్రోల్ చేసుకొనివిచక్షణతో వ్యవహరించారని కామెంట్స్ చేస్తున్నారు. వీడియో చూసిన అభిమానులు ఈ వీడియో పై వివిధ రకంగా కామెంట్స్ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

#SalmanKhan does not appreciate a fan pulling him like this

A post shared by Viral Bhayani (@viralbhayani) on

Related posts