ముచ్చ్తగా మూడోసారి సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్నాడు. ఈ మూవీ ఏఏ20గా తెరకెక్కబోతోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి,దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర వార్తలు ఇప్పుడు ఫిలింనగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. అవేంటంటే.. ఈ మూవీలో తమిళ స్టార్ నటుడు విజయ్ సేతుపతి ఫారెస్ట్ ఆఫీసర్‌గా ఓ కీలక పాత్రలో నటించబోతున్నారట. ఆయనతో పాటు టాలీవుడ్ విలక్షణ నటుడు జగపతి బాబు, కన్నడ స్టార్ నటుడు రాజ్ దీపక్ శెట్టి విలన్లుగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. కాగా సుకుమార్‌తెరకెక్కించిన ‘నాన్నకు ప్రేమతో’, ‘రంగస్థలం’ చిత్రాల్లో జగపతిబాబుకు గుర్తుండిపోయే పాత్రలను ఇచ్చారు సుకుమార్. ఈ క్రమంలో ఇప్పుడు మరోసారి తన సినిమాలో విలన్‌గా ఆయన్నే ఎన్నుకున్నట్లు సమాచారం. ఇక ఇందులో బన్నీ చిత్తూరుకు చెందిన లారీ డ్రైవర్ పాత్రలో కనిపించబోతున్నారట. ఇందుకోసం రాయలసీమ యాసను కూడా నేర్చుకుంటున్నారట. .
previous post