కేరళ రాష్ట్రంలో కోవిద్-19(కరోనా వైరస్) కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంది. ఇప్పటి వరకు అవ్యాధిబారిన పడిన వారి సంఖ్య 12 కు చేరింది. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది సీఎం పినరయి విజయన్ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. జనాలు రద్దీగా ఉండే ప్రాంతాలపై దృష్టి సారించాలని అధికారులను సీఎంఆదేశించారు.
మార్చి 31వ తేదీ వరకు కేరళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సినిమా థియేటర్లను మూసివేయాలని నిర్ణయించారు. పెళ్లిళ్లకు కూడా దగ్గరి బంధువులు మాత్రమే హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఫంక్షన్లతో పాటు ఇతర కార్యక్రమాలను వాయిదా వేసుకోవాలని సీఎం చెప్పారు. ఏడో తరగతి లోపు విద్యార్థులకు క్లాసులు, పరీక్షలు రద్దు చేస్తున్నట్లు తెలిపారు.. ఇక ప్రైమరీ స్కూళ్లకు సెలవులు ప్రకటించారు.