కాంగ్రెస్ పార్టీకి తాత్కాలిక అధ్యక్షురాలిని కాదు.. పూర్తి స్థాయి అధ్యక్షురాలిని నేనేనంటూ ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. నూతన ప్రెసిడెంట్ ఎన్నిక కరోనా వల్లే ఆలస్యమైందని అన్నారు.
పార్టీ అంతర్గత వ్యవహారాలపై బహిరంగంగా మాట్లాడితే సహించేది లేదని, తమ అభిప్రాయాలను నిర్మొహమాటంగా చెబితే తాను అభినందిస్తానని 23 మంది అసమ్మతి నేతలకు వార్నింగ్ ఇచ్చారు. ఈ రోజు అన్ని విషయాలపై స్పష్టత తీసుకురాల్సిన సందర్భమొచ్చిందని, నిజాయతీగా అన్ని అంశాలపై చర్చిద్దామన్నారు.
ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పార్టీ పూర్వవైభవం కోరుకుంటున్నారని, అందుకు నాయకులు ఐక్యంగా ఉండటం, పార్టీ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకోవడం అవసరమన్నారు.
అంతేకాకుండా సోనియా వ్యవసాయ చట్టాలు, ప్రభుత్వ విధానాలు, వైఫల్యాలను ఎండగట్టారు. కొత్త వ్యవసాయ బిల్లులను వెనక్కి తీసుకోవాలని సీడబ్ల్యూసీ డిమాండ్ చేసింది. లఖీంపుర్ ఖేరిలో జరిగిన ఘటనపై సీడబ్ల్యూసీ సమావేశంలో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు సోనియా. భాజపా నేతల మనస్తత్వానికి, రైతుల ఆందోళనలపై వారి ఆలోచనకు ఇది నిదర్శమన్నారు. విదేశాంగ విధానం, సరిహద్దులో పరిస్థితులపైనా సోనియా ఆందోళన వ్యక్తం చేశారు.
అలాగే జమ్ము కశ్మీర్‌లో మైనారిటీల హత్యలను సోనియా ఖండించారు. నేరస్థులను చట్టానికి తీసుకురావడం, ఈ కేంద్రపాలిత ప్రాంతంలో శాంతి సామరస్యాన్ని పునరుద్ధరించడం కేంద్రం బాధ్యత అని, జమ్మూకాశ్మీర్లో పరిస్థితులు చక్కదిద్దాలని సూచించారు.
దాడులు చేయడం ఈ ప్రభుత్వానికి అటవాటే: గోరంట్ల