telugu navyamedia
సినిమా వార్తలు

‘మా’ నూతన అధ్యక్షుడిగా మంచు విష్ణు ప్రమాణ స్వీకారం..

‘మా’ నూతన అధ్యక్షుడిగా మంచు విష్ణు ప్రమాణం చేశారు.. ఫిలిం చాంబర్‌లో మా ఎన్నికల అధికారి కృష్ణ మోహన్‌ అధ్వర్యంలో విష్ణు ప్రమాణ స్వీకారం చేసి అనంతరం సంతకం చేశారు. విష్ణుతో పాటు ఆయన ప్యానెల్‌ నుంచి గెలుపొందిన 15 సభ్యులూ ప్రమాణస్వీకారం చేశారు.

MAA Elections 2021: Manchu Vishnu Take Oath As MAA President - Sakshi

కాగా.. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్ ముఖ్య అతిథిగా హాజ‌రయ్యారు. నటుడు మోహన్‌ బాబు, నరేష్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజ‌ర‌య్యారు. అలాగే విష్ణు సతిమణి విరానిక వారి పిల్లులు కూడా హాజ‌ర‌య్యారు.

మంచు విష్ణు ప్యానెల్ నుంచి విజయం సాధించిన‌వారు..
అధ్యక్షుడిగా విష్ణు, జనరల్ సెక్రటరీగా రఘుబాబు, జాయింట్ సెక్రటరీగా గౌతంరాజు, వైస్ ప్రెసిడెంట్‌గా మాదాల రవి, ట్రెజరర్‌గా శివబాలాజీ విక్టరీ కొడితే… ఈసీ మెంబర్స్‌గా గీతాసింగ్, అశోక్ కుమార్, శ్రీలక్ష్మి, సి.మాణిక్, శ్రీనివాసులు, హరనాథ్‌బాబు, శివన్నారాయణ, సంపూర్ణేష్‌బాబు, శశాంక్, బొప్పన విజయం సాధించారు.

Will Take Back My Resignation On One Condition: Prakash Raj -

హాజరుకాని ప్రకాశ్‌రాజ్‌ ప్యానెల్‌..
‘మా’ ఎన్నికల్లో విష్ణుపై ప్రకాశ్‌రాజ్‌ పోరాడి ఓడిపోగా.. ఆయన ప్యానెల్‌ నుంచి 11 మంది విజయం సాధించినప్పటికీ.. కొన్ని కారణాల వల్ల విష్ణు ప్యానెల్‌ సభ్యులతో కలిసి పనిచేయలేమంటూ తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ క్రమంలో తాజాగా జరిగిన ‘మా’ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారానికి ప్రకాశ్‌రాజ్‌, అతని ప్యానెల్‌ సభ్యులెవరూ హాజరు కాలేదు.

 

Related posts