telugu navyamedia
సినిమా వార్తలు

“దర్భార్” సెకండ్ లుక్

Darbar

ర‌జ‌నీకాంత్‌, ఎ.ఆర్‌.మురుగ‌దాస్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న చిత్రం “ద‌ర్బార్‌”. లైకా ప్రొడ‌క్ష‌న్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. న‌య‌న‌తార, నివేదా థామ‌స్‌, దలీప్ తాహిల్‌, ప్ర‌తీక్ బబ్బ‌ర్ త‌దిత‌రులు న‌టిస్తున్నారు. సుభాస్క‌ర‌న్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ న‌టుడు సునీల్ శెట్టి విల‌న్‌గా క‌నిపించ‌బోతున్నాడ‌ట‌. వ‌చ్చే ఏడాది సంక్రాంతికి “ద‌ర్భార్” చిత్రాన్ని విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ప్ర‌స్తుతం సినిమా ముంబైలో చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది. ఈ చిత్రంలో ర‌జ‌నీకాంత్ ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో న‌టిస్తుండ‌గా… అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. ఇక సంతోశ్ శివ‌న్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. ఈ సినిమాపై సూపర్ స్టార్ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు సంబంధించి ప‌లు లుక్స్‌, పోసర్ట్స్ విడుద‌ల‌య్యాయి. తాజాగా “ద‌ర్బార్‌” సెకండ్ లుక్ను విడుద‌ల చేశారు. ప‌క్కా మాస్ లుక్‌లో సై అంటే సై అనేలా ర‌జ‌నీ గెట‌ప్ అంద‌రినీ ఆక‌ట్టుకుంటుంది.

Related posts