telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కరోనా ఎఫెక్ట్ : సల్మాన్ సలహా… నమస్కారం చేయడం మన సంస్కారం

Salman-KHan

కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో బాలీవుడ్ ప్రముఖ హీరో, కండలవీరుడు సల్మాన్ ఖాన్ నెటిజన్లకు తాజాగా సలహా ఇచ్చారు. సల్మాన్ ఖాన్ జిమ్‌లో వర్క్ అవుట్ చేసిన భారత సంప్రదాయం ప్రకారం చేతులు జోడించి నమస్తే చెపుతూ ఉన్న తన ఫోటోను ఇన్‌స్టాగ్రాంలో పోస్టు చేశారు. నమస్కారం చేయడం, సలాం చేయడం మన సభ్యతా, సంప్రదాయమని, కరోనా వైరస్ తగ్గాక మనం చేతులు కలుపుదాం, కౌగిలించుకుందాం అంటూ సల్మాన్ ఖాన్ నమస్తే పెడుతున్న చిత్రానికి క్యాప్షన్ పెట్టారు. సల్మాన్ ఖాన్ తాజాగా 30 మిలియన్ల ఫాలోయర్స్ ను పొందిన నేపథ్యంలో తన అభిమానులకు ఆయన కృతజ్ఞతలు తెలుపుతూ షార్టు వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో సల్మాన్ ఖాన్ తన అభిమానులకు చేతులు జోడించి కృతజ్ఞతలు చెబుతూ శాల్యూట్ చేశారు.

Related posts