telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ప్రత్యేకంగా మహిళా దినోత్సవం ఎందుకు ? : రకుల్

Rakul-PReeth-Singh

ప్రతియేటా మార్చి ఎనిమిదో తేదీన మహిళా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరుపుతారు. అన్ని రంగాలకు చెందిన మహిళలూ ఆ రోజును ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే మహిళా దినోత్సవం వల్ల ఉపయోగం ఏమీ ఉండదని హీరోయిన్ రకుల్ ప్రీత్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో అభిప్రాయపడింది. `ప్రత్యేకంగా మహిళా దినోత్సవం జరుపుకోవడం ఎందుకో నాకర్థం కావడం లేదు. పురుషుల కోసం ప్రత్యేకంగా ఏ రోజూ లేదు కదా! అలాంటప్పుడు ఆ ఒక్క రోజూ మహిళలకు ఎందుకు? నా ఉద్దేశంలో ప్రతిరోజూ మహిళలు ఆనందంగా, హుందాగా ఉండాలి. చుట్టూ ఉన్న మహిళలను ప్రతిరోజూ గౌరవిస్తే చాలు. అంతకు మించి ఇంకేం అక్కర్లేదు` అంటూ రకుల్ సూచించింది.

Related posts