telugu navyamedia
సినిమా వార్తలు

మహేష్, అనిల్ రావిపూడి సినిమాకు ముహూర్తం ఖరారు

Surgical strike mahesh selute poilets

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ తన 25వ సినిమా “మహర్షి”తో హిట్ అందుకుని ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇప్పుడు ఆయన త‌దుప‌రి సినిమాకు రంగం సిద్ధ‌మ‌వుతుంది. మ‌హేష్ 26వ చిత్రం అనీల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌నుంది అనే విషయం తెలిసిందే. దిల్‌రాజు, అనీల్ సుంక‌ర క‌లిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజా స‌మాచారం ప్రకారం ఈ సినిమా ఈ నెల 31నే లాంఛ‌నంగా ప్రారంభ‌మ‌వుతుంద‌ని అంటున్నారు. ఆ రోజు మ‌హేష్ తండ్రి, సూప‌ర్‌స్టార్ కృష్ణ పుట్టిన‌రోజు. అయితే మ‌హేష్ మాత్రం ఫ్యామిలీతో సమ్మ‌ర్ వెకేష‌న్‌ ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక మహేష్ త‌న సినిమా ప్రారంభోత్స‌వ వేడుక‌ల‌కు ఎప్పుడూ రాడు. అదే అన‌వాయితీ ఈ సినిమాకు కంటిన్యూ చేస్తున్నరు. ఎప్ప‌టిలాగానే కృష్ణ సినిమా ప్రారంభ‌ వేడుక‌కి వ‌చ్చి యూనిట్‌ను ఆశీర్వ‌దిస్తాడ‌ట‌. సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ మాత్రం జూలై నుండి ప్రారంభమవుతుందని సమాచారం.

Related posts