telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

వడివేలు బాలాజీ పిల్లల్ని చదివించేందుకు ముందుకొచ్చిన శివకార్తికేయన్

karthikeya

ప్రముఖ హాస్యనటుడు వడివేల్‌ బాలాజీ గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. చిన్న వయస్సులోనే బాలాజీ అకస్మికంగా మృతి చెందడంతో తమిళ సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. వడివేల్ బాలాజీకి భార్య, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. ప్రైవేటు ఆస్పత్రిలో వెంటిలేటర్ సహాయంతో చికిత్స పొందుతున్న బాలాజీని ఆ తరువాత కుటుంబ ఆర్థిక కారణాల వల్ల అతనిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన వడివేలు అక్కడ 15 రోజులపాటు చికిత్స పొందుతూ మరణించాడు. దురైలో జన్మించిన ఈ నటుడు 1991 లో విడుదలైన ఎన్ రాసవిన్ మనసిలే అనే చిత్రంతో తమిళ సినిమాల్లోకి అడుగుపెట్టారు. ప్రముఖ హాస్యనటుడు వడివేల్‌ను అనుకరిస్తూ నటించినందుకు బాలాజీ అనేక ప్రశంసలు పొందారు. అయితే అనారోగ్యంతో కన్నుమూసిన తమిళ హాస్యనటుడు వడివేలు బాలాజీ ఇద్దరు పిల్లల్ని చదివించేందుకు నటుడు శివకార్తికేయన్ ముందుకొచ్చారు. బాలాజీ పిల్లల చదువులకు అయ్యే ఖర్చులు తాను భరిస్తానని హామీ ఇచ్చారు. శివకార్తికేయన్ మంచి మనసుకు ప్రశంసలు కురుస్తున్నాయి. బాలాజీ కుటుంబానికి విజయ్ సేతుపతి కూడా కొంత ఆర్థిక సాయం చేసినట్టు చెబుతున్నారు.

Related posts