telugu navyamedia
క్రైమ్ వార్తలు

రాయ్‌పూర్‌ రైల్వే స్టేషన్‌లో భారీ పేలుడు..

ఛత్తీస్‌గఢ్‌ రాజధాని రాయ్‌పూర్‌ రైల్వే స్టేషన్‌లో భారీ పేలుడు జ‌రిగింది. ఈ ఘటనలో ఆరుగురు CRPF జవాన్లకు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్ధితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సీఆర్‌పీఎఫ్‌ స్పెషల్‌ ట్రైన్‌లో ఇగ్నిటర్‌సెట్‌ ఉన్న బాక్స్‌ కిందపడి పేలుడు వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఈ ఉదయం 6.30 సమయంలో ప్లాట్‌ఫామ్‌ 2పై ఈ ఘటన జరిగింది.

జార్సుగూడ నుంచి జమ్ముతావీకి వెళ్తున్న ట్రైన్‌ ప్లాట్‌ఫామ్‌పై ఆగి ఉంది. ఆసమయంలో గ్రైనేడ్ లు ఉన్న పెట్టెను ఒక బోగి నుంచి మరోక బోగీలోకి తరలిస్తుండగా పొరపాటున చేయిజారి పెట్టె కింద పడిపోవ‌డంతో ఆ పెట్టెలోని డిటోనేటర్ పేలి ఒక్కసారిగా పేలుడు జరిగింది. గాయపడ్డవారందరికీ స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.

ఈ ఘటనపై సీఆర్పీఎఫ్ ఉన్నతాధికారులు రైల్వే స్టేషన్ కు చేరుకుని ఘటన జరిగిన ప్రదేశాన్ని పరీశీలించి విచారణ జరుపుతున్నారు. కాగా రైల్వే స్టేషన్‌లో ప్రమాదం జరగడంతో ప్రయాణికులంతా ఒక్కసారిగా భయంతో పరుగులు తీశారు.

Related posts