telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

దేవిరెడ్డి శ్రీనాధరెడ్డి కి .. ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ పదవి..

AP

ఏపీసీఎం జగన్ రాష్ట్ర ప్రెస్ అకాడమీ ఛైర్మన్ గా దేవిరెడ్డి శ్రీనాధరెడ్డి నియమిస్తూ ఆదేశాలు జారీచేశారు. ఇప్పటి వరకు మీడియా సంబంధిత వ్యవహారాల్లో తమ సొంత మీడియా గ్రూపులో పని చేసిన వారికి..అందునా తెలంగాణ ప్రాంతానికి చెందిన వారికి పదవులు కట్టబెడుతున్నారనే విమర్శల నడుమ ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. దేవిరెడ్డి శ్రీనాధరెడ్డి కడప జిల్లా పులివెందుల మండలం కోరుగుంటపల్లెకు చెందిన వారు. 28 ఏళ్లుగా ఆయన జర్నలిస్టుగా కొనసాగుతున్నారు. వివిధ పత్రికల్లో పని చేసిన అనుభవం ఉంది. అదే విధంగా 2014 నుండి సాక్షి పొలిటికల్ సెల్ సలహాదారుడిగా పని చేసారు. దీంతో..ఇప్పుడు శ్రీనాధరెడ్డికి ఈ పదవి కట్టబెట్టాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించారు.

కడప జిల్లాకు చెందిన శ్రీనాధరెడ్డి జర్నలిస్టుగా పని చేస్తూనే రాయలసీమ హక్కుల కోసం పోరాడారు. వైయస్సార్ తో సహా మైసూరారెడ్డి.. జేసీ దివాకర రెడ్డి.. మైసూరా రెడ్డితో కలిసి పని చేశారు. ఉమ్మడి ఏపీలో ఆయన ఏపీడబ్ల్యూలో అనేక హోదాల్లో పని చేశారు. ముఖ్యమంత్రి మీడియా సలహాదారుడిగా పదవితో పాటుగా సీపీఆర్వో.. అదే విధంగా జాతీయ స్థాయిలో మీడియా రిలేషన్స్ బాధ్యతలు..ఇక పబ్లిక్ పాలసీ సలహాదారుడి హోదా వంటివి తమ సొంత మీడియా సంస్థలో పని చేసిన వారికి కట్టబెట్టారని పెద్ద ఎత్తు విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. దీంతో..దీనిని నియంత్రించేందుకు వెంటనే రాయలసీమ ప్రాంతానికి చెందిన వ్యక్తికి ప్రెస్ అకాడమీ ఛైర్మన్ గా అవకాశం కల్పించాలని నిర్ణయించారు. ఈ మేరకు అధికారికంగా ఉత్తర్వులు వెలువడనున్నాయి.

Related posts