telugu navyamedia
క్రీడలు రాజకీయ

లార్డ్స్ టెస్ట్‌లో టీమిండియా అరుదైన రికార్డు..!

లార్డ్స్ టెస్ట్ మ్యాచ్‌లో ఇండియా చరిత్రాత్మక విజయం సాధించమే కాదు..మరో రికార్డు కూడా దక్కింది. 39 ఏళ్ల తరువాత టీమ్ ఇండియా బౌలర్ సిరాజ్ సాధించిన గౌరవమది. ఇండియా-ఇంగ్లండ్ టెస్ట్ మ్యాచ్‌లో ఇండియా ఆతిధ్య జట్టుపై చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది.

England vs India: Best Memes On Twitter After India's Epic Win vs England  At Lord's | Cricket News

ఓ దశలో డ్రా అయితే మంచిదనుకునే పరిస్థితి నుంచి అనూహ్యంగా పుంజుకుని ఇంగ్లాండ్‌ షాక్ ఇచ్చింది . ఇండియా విజయంతో 5 టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో ఇండియా 1-0 ఆధిక్యంతో నిలిచింది. అయితే ఇదే టెస్ట్ మ్యాచ్‌లో టీమ్ ఇండియా పేస్ బౌలర్ మొహ్మద్ సిరాజ్ అరుదైన గౌరవం సాధించాడు.

Brisbane Test: Mohammed Siraj enters elite list with 5-wicket haul, tops India  bowling charts in maiden series - Sports News

లార్డ్స్ టెస్ట్ మ్యాచ్ లో టీమ్ ఇండియా బౌలర్ మొహమ్మద్ సిరాజ్ రెండు ఇన్నింగ్స్‌లు కలిపి 8 వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు, రెండవ ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు తీసుకున్నాడు. లార్డ్స్ టెస్ట్‌లో ఒక టీమ్ ఇండియా బౌలర్ ఇన్ని వికెట్లు సాధించడం ఇది రెండవసారి. 39 ఏళ్లపాటున్న రికార్డును బద్దలు కొట్టాడు. అది కూడా ప్రముఖ క్రికెటర్, టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ పేరిట ఉన్న రికార్డును సమం చేశాడు మొహ్మద్ సిరాజ్.

With dreamy debut, Mohammed Siraj fulfils late father's dream | Sports  News,The Indian Express

1932 లో లార్డ్స్ మైదానంలో సికే నాయుడు నాయకత్వంలో మొదటి టెస్ట్ మ్యాచ్ ఆడిన భారత్.. 2021 ఆగష్టు16 వరకు జరిగిన లార్డ్స్ లో జరిగిన 19 టెస్ట్ మ్యాచ్ లలో కేవలం 3 మ్యాచ్ లలో గెలుపొందింది. 1986లో కపిల్ దేవ్ సారధ్యంలో మొదటి టెస్ట్ గెలిచిన భారత్, 2014లో ధోని కెప్టేన్సీ లో రెండో టెస్ట్, తాజాగా 2021 లో విరాట్ కోహ్లి సారధ్యంలో మూడో టెస్ట్ ని గెలిచింది.

Jay Shah Points Out The Importance Of June 25 In Indian Cricket

అంతకముందు అంటే 1982లో కపిల్ దేవ్ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు, రెండవ ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు మొత్తం 8 వికెట్లు పడగొట్టాడు. కపిల్ దేవ్ తరువాత అంటే 39 ఏళ్ల అనంతరం ఆ ఘనత సాధించింది మొహమ్మద్ సిరాజ్ ఒక్క‌డే..!

హోరాహోరిగా జ‌రిగిన ఈ రెండో టెస్ట్ మ్యాచ్ లో మ్యాచ్ లో ఎవరు ఊహించని విధంగా ఇంగ్లండ్ పై టీమిండియా గెలవడంతో అభిమానులు సంబరాలు చేసుకున్నారు.

Related posts