జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తిరుమల తిరుపతి దేవస్థానం మాదిరిగా అహోబిలం అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. అహోబిలం సందర్శించిన ఆయన మీడియాతో మాట్లాడారు. అహోబిలం ఎక్కడో మూలకు విసిరేసిన ప్రాంతం గా కావడానికి, పాలకుల నిర్లక్ష్యం కారణం అని ఆయన అన్నారు. కర్నూలు జిల్లాకు అహోబిలం ముఖద్వారం కావాలన్నారు.
తాను గవర్నర్ ను కలిసిన విషయాన్ని విలేకరులు ప్రస్తావించగా… ఆయనతో రాజకీయ అంశాలపై చర్చించలేదన్నారు. కేవలం యోగక్షేమాల గురించే మాట్లాడానని పవన్ కల్యాణ్ తెలిపారు.
మరోసారి చీపురుపట్టిన ప్రియాంక గాంధీ