telugu navyamedia
క్రీడలు

టీమిండియా డీలా… 315 రన్స్ బంగ్లాదేశ్ టార్గెట్ 

World-cup

బర్మింగ్ హామ్ లో బంగ్లాదేశ్ తో జరుగుతున్న ప్రపంచకప్ లీగ్ మ్యాచ్ లో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 314 పరుగులు చేసింది. మొదట్లో రోహిత్-రాహుల్, ఆ తర్వాత కోహ్లీ, పంత్ క్రీజులో ఉన్నంతవరకు దూకుడు ప్రదర్శించిన భారత్, వారి నిష్క్రమణ తర్వాత డీలాపడిపోయింది. ముఖ్యంగా ఆఖరి ఓవర్లలో ఆట పేలవంగా సాగింది. భారత్ 314 పరుగులకే పరిమితం కావడంలో బంగ్లాదేశ్ ప్రధాన ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిజూర్ రెహ్మాన్ ముఖ్యభూమిక పోషించాడు. మొత్తం 5 వికెట్లు తీసి భారత బ్యాటింగ్ లైనప్ పై ప్రభావం చూపాడు. టీమిండియా తన చివరి ఓవర్లో 3 వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ రోహిత్ శర్మ (104 ) బంగ్లా బౌలర్లను ఉక్కిరిబిక్కిరి చేస్తూ రికార్డు స్థాయిలో నాలుగో సెంచరీ సాధించాడు. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ సైతం ఫామ్ ను కొనసాగిస్తూ 77 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. వీళ్లిద్దరి తర్వాత 48 పరుగులతో రిషబ్ పంత్ ఆకట్టుకున్నాడు.

Related posts