ఏపీలో దిశ చట్టం తీసుకొచ్చామని వైసీపీ ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటోందని టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనూరాధ విమర్శించారు. మహిళలను వేధించిన వైసీపీ నేతలు మాత్రం రోడ్లపై దర్జాగా తిరుగుతున్నారని దుయ్యబట్టారు.
రాష్ట్రంలో అత్యాచారాలు పెరిగిపోతూనే ఉన్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఇందుకు నిదర్శనం తాజాగా జరిగిన చినకాకాని ఘటనేనని విమర్శించారు. సీఎం జగన్ క్యాంపు ఆఫీసుకు దగ్గర్లోనే ఈ దారుణం జరిగిందని మండిపడ్డారు.