దేశవ్యాప్తంగా లోక్ సభ రెండో విడత పోలింగ్ కొనసాగుతోంది. 11 రాష్ట్రాలు, ఓ కేంద్రపాలిత ప్రాంతంలోని 95 నియోజకవర్గాల్లో ఈ ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. ఉదయం 7గంటల నుంచే ఓటు వేసేందుకు ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. వేసవి దృష్ట్యా ప్రజలంతా ఉదయాన్నేపోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అలాగే సినీ ప్రముఖులు కూడా క్యూలో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ చెన్నై సెంట్రల్ పార్లమెంటరీ నియోజవర్గంలోని స్టెల్లా మేరిస్ కాలేజీలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో ఆయన కుమార్తె, స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్ క్యూ లైన్లో నిల్చొని మరీ ఓటు వేశారు. వారి బాటలోనే హీరో సూర్య, ఆయన భార్య జ్యోతిక, కార్తీ, మరో హీరో విజయ్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
బీజేపీలో చేరనందుకే శివకుమార్ పై వేధింపులు: సిద్ధరామయ్య