telugu navyamedia
క్రీడలు

యువ క్రికేట‌ర్ గుండెపోటుతో మృతి ..

సౌరాష్ట్ర క్రికెటర్ అవీ భరోట్ గుండెపోటుతో శుక్రవారం మరణించాడు. అత‌ని కేవ‌లం 29 సంవ‌త్స‌రాలు సౌరాష్ట్ర క్రికెట్‌ అసోసియేషన్‌(ఎస్‌సీఏ) ఈ విషయాన్ని ధ్రువీకరించింది. ‘‘ఈ వార్త విని ప్రతి ఒ​క్కరం దిగ్భ్రాంతికి గురయ్యాం. అవి బరోట్‌ అక్టోబరు 15 సాయంత్రం గుండెపోటుతో మరణించాడు. సౌరాష్ట్ర క్రికెట్‌లో తనకంటూ ప్రత్యేక స్థానం ఉంది’’ అని బాధాతప్త హృదయంతో మీడియాకు ప్రకటన విడుదల చేసింది.

వికెట్ కీపర్ నుంచి బ్యాట్స్‌మెన్ అయిన అవీ భరోట్.. హర్యానాతో పాటు గుజరాత్ వంటి జట్ల తరుపున దేశవాళీ టోర్నీల్లో పాల్గొన్నాడు. బరోట్‌… అండర్‌-19 క్రికెట్‌ జట్టుకు కెప్టెన్‌(2011)గా వ్యవహరించాడు. 2019-20 సీజన్‌కు గానూ రంజీ ట్రోఫీ గెలిచిన జట్టులో అతడు సభ్యుడు. ఫస్టక్లాస్ క్రికెట్‌లో 1547, లిస్టు ఏ క్రికెట్‌లో 1030, టీ20ల్లో 717 పరుగు చేశాడు.

అలాగే అవి ‘తండ్రి 42 ఏళ్ళ వయసులో మరణించారు. అతను త‌న‌ త‌ల్లి, భార్యతో క‌లిసిఉండేవాడు. ప్ర‌స్తుతం అత‌ను భార్య నాలుగు నెలల గర్భవతి తెలుస్తోంది. నేను ఇంకా షాక్ లోనే ఉన్నాను. ఈ విషాదాన్ని అంగీకరించడానికి నాకు చాలా సమయం పడుతుంది” అని షా అన్నారు. గత వారం మాకు రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ జీవన్ ట్రోఫీ వచ్చింది, అక్కడకు అతను వచ్చి ఆడాడు అని అని షా గుర్తు చేసుకున్నారు.

కాగా.. ఐపీఎల్‌-14లో చెన్నై సూప‌ర్‌కింగ్స్ ఛాంపియ‌న్‌గా నిలిచింది. సీఎస్‌కే విజయంతో సంబరాల్లో ఉన్న క్రికెట్ అభిమానులకు ఇది ఖచ్చితంగా విషాదకర వార్తే అనే చెప్పాలి.

Related posts