telugu navyamedia
రాజకీయ

ఆప్‌ని వదిలేసి బీజేపీలో చేరితే సీబీఐ, ఈడీ కేసుల‌ను ఎత్తేస్తామ‌న్నారు..

*ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
*డిప్యూటీ సీఎం ప‌ద‌వి వ‌దులుకుంటే సీబీఐ, ఈడీ కేసులు ఎత్తేస్తామ‌ని ఆఫ‌ర్
*నాపై కేసులన్నీ నిరాధారమైనవే

ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో చేరితే తనపై ఉన్న కేసులన్నీ మాఫీ అవుతాయని తనకు మెసెజ్ వచ్చిందని తెలిపారు.

మీరు ఆప్‌ని వదిలేసి వ‌స్తే సీబీఐ, ఈడీ కేసులు ఎత్తివేస్తామని బీజేపీ నేతలు తనకు సందేశాన్ని పంపారని ఆయన కామెంట్ చేశారు. 

అంతేకాదు తనపై పెట్టిన కేసులన్ని తప్పడు కేసులుని గట్టిగా నొక్కి చెప్పడమే కాకుండా మీరేం చేయాలకుంటే అది చేసుకోండి అని సిసోడియా బీజేపీకి సవాలు విసిరారు.

తాను రాజ్‌పుత్‌నని, మహారాణా ప్రతాప్‌ వంశస్థుడునని అన్నారు. నా తలైనా నరుక్కుంటాను కానీ…అలాంటి అవినీతి పరులు, కుట్రదారుల ముందు తల వంచే ప్రసక్తి లేదని మనీష్ సిసోడియా తెలిపారు

ఒక పక్క దేశంలో ప్రజలు ద్రవ్యోల్బణం, ఆకాశన్నంటుతున్న ధరలతో బాధపడుతుంటే రాష్ట్రాలలోని ప్రభుత్వాలను  పడగొట్టే పనులుకు పాల్పడుతోంది బీజేపీ అని ఎద్దేవా చేశారు. బీజేపీ నేతృత్వంలో సీబీఐ దుర్వినియోగం అవుతోందంటూ విరుచుకుపడ్డారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కి, ప్రధాని నరేంద్ర మోదీకి మధ్య పోటీ జరుగుతుందని అన్నారు. ఢిల్లీ నాయకుడుని అడ్డుకునేందుకు బీజేపీ కేంద్ర ఏజెన్సీలను ఇలా దుర్వినియోగం చేస్తోందంటూ మండిపడ్డారు.

 అయితే ఈ వ్యాఖ్యలు అర్థరహితమని బీజేపీ నేతలు కొట్టి పారేస్తున్నారు. ఆయన అవినీతి కేసులో చిక్కుకుని ఏదేదో మాట్లాడుతున్నారని బీజేపీ నేతలు వ్యాఖ్యానించారు

 

Related posts