telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

దేవాయాల్లోని అర్చకులకు శుభవార్త

దేవాలయాల్లో పనిచేస్తున్న అర్చకులకు ఏపీ సర్కార్ శుభవార్త చెప్పింది. దేవాదాయ శాఖ మంత్రిగా వెల్లంపల్లి శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించారు. సచివాలయం రెండో బ్లాక్ లోని తన ఛాంబర్ లో ఈరోజు ఆయన బాధ్యతలు చేపట్టారు. . ఈ సందర్భంగా పలువురు మంత్రులు, సంబంధింత అధికారులు ఆయన్ని అభినందించారు.

ఆలయాల్లో అర్చకులకు 25 శాతం పారితోషికం పెంచుతూ తొలి ఫైల్ పై ఆయన సంతకం చేశారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ, అర్హులైన అర్చకులందరికీ ఇళ్ల స్థలాలు, ఇల్లు మంజూరు చేస్తామని హామీ చెప్పారు. అన్యాక్రాంతమైన దేవాదాయ భూములను పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. దేవాదాయ శాఖలో ఖాళీగా ఉన్న పోస్ట్ లను భర్తీ చేస్తామని తెలిపారు.

Related posts