telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

నిమ్మగడ్డ కేసులో స్టే నిరాకరించిన సుప్రీం కోర్టు

Supreme Court

రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కేసులో ఏపీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో చుక్కెదురయ్యింది. ఆయన కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వడానికి అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వ్యవహారంపై సుప్రీం కోర్టులో ఈ రోజు విచారణ జరిగింది. నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ను కమిషనర్‌గా కొనసాగించాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది.

ఏపీ ప్రభుత్వ పిటిషన్‌పై ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా జగన్ సర్కార్‌పై ధర్మాసనం తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేసింది. ఏపీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ను తొలగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ వెనుక ఉన్న ఉద్దేశాలు సంతృప్తికరంగా లేవని వ్యాఖ్యానించింది. ఇలాంటి ఆర్డినెన్స్‌లు ఎలా ఆమోదిస్తారని ప్రశ్నించింది. రాజ్యాంగ సంస్థలతో ఆటలు తగదని హెచ్చరించింది. ఈ కేసులో ప్రతివాదులకు కోర్టు నోటీసులు జారీ చేసింది. ‌

Related posts