రాజకీయ లబ్ధి కోసం టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఏపీ సచివాలయంలో ఈ రోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వంపై బురదజల్లాలని చంద్రబాబు చూస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఏడు లక్షల పెన్షన్లు తొలగించామని ఆయన చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మొద్దని ప్రజలను కోరారు.పింఛన్ల సంఖ్యను తగ్గించుకోవాలన్న ఆలోచన తమ ప్రభుత్వానికి లేదని చెప్పారు.
కొత్తగా ఆరు లక్షల మందికి పైగా పింఛన్లు ఇచ్చామని, పాతవారిలో 4,16,034 మందిని పింఛన్లకు అనర్హులుగా గుర్తించామని, పున:పరిశీలన చేసి ఇందులో పింఛన్లకు అర్హులైన వారు ఉంటే ఇస్తామని, ఈ విషయమై వార్డు వాలంటీర్లు ప్రస్తుతం తనిఖీలు చేస్తున్నారని అన్నారు. ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని, పేదలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు.
రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యలకు పేర్ని నాని కౌంటర్