telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఏపీలో ఇళ్ల పట్టాల పంపిణీ పండుగ జరుగుతోంది : సీఎం జగన్‌

చిత్తూరు జిల్లాలో ఇవాళ సీఎం జగన్‌ పర్యటించారు. ఈ సందర్బంగా శ్రీకాళహస్తి మండలం ఊరందూరులో పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల స్థలాల పంపిణీ పండుగ జరుగుతోందని… సొంతిళ్లు లేని నిరు పేదల్లో చిరునవ్వు కనిపిస్తోందన్నారు సీఎం జగన్‌. రూపాయి విలువ మహిళకు తెలిసినంతగా మగవాళ్లకు తెలియదని… ప్రతీ రూపాయిని మహిళలు జాగ్రత్తగా ఖర్చు చేస్తారని పేర్కొన్నారు సీఎం జగన్‌. అందుకే మహిళల ఖాతాల్లోనే నేరుగా నగదు జమ చేస్తున్నామని.. రాజకీయంగా, ఆర్థికంగా మహిళలను ఉన్నతస్థాయిలో కూర్చోబెట్టాలని కృష్టి చేస్తున్నామని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 30.75 లక్షల మందికి ఇళ్ల పట్టాల పంపిణీ చేస్తున్నామని తెలిపారు. తొలి దశలో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణాలను చేపడుతున్నామని చెప్పారు. తనకు ఓటు వేయని వారికి కూడా ఇళ్ల పట్టాలు ఇస్తున్నామని సీఎం జగన్‌ స్పష్టం చేశారు.

Related posts