కరోనా కేసులు ఎక్కువగా ఉన్న జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఏపీ సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. కోవిడ్-19 పై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాస్కుల తయారీని స్వయం సహాయక సంఘాలకు అప్పగించాలని తెలిపారు. హాట్ స్పాట్ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరికీ 3 మాస్కులుమాస్కులు పంపిణీ చేయాలని ఆదేశించారు. ప్రతి ఒక్కరూ భౌతిక దూరం తప్పక పాటించేలా నిబంధనలు అమలు చేయాలని సూచించారు.
రెండు రోజుల తర్వాత మాస్కుల పంపిణీ విస్తృతం చేస్తామని జగన్ కు అధికారులు తెలిపారు. క్వారంటైన్ ప్రాంతాల్లో సదుపాయాలపై నిరంతరం దృష్టి పెట్టాలని, క్వారంటైన్ పూర్తి చేసుకుని తమ ఇళ్లకు వెళ్లే వాళ్లకు రూ.2 వేల చొప్పున అందజేయాలని ఆదేశించారు. రైతు భరోసా లబ్ధిదారుల జాబితాను, మత్స్య కార భరోసా లబ్ధిదారుల జాబితాను గ్రామ సచివాలయాల్లో ఉంచాలని జగన్ ఆదేశించారు. ఆర్టీకే కేంద్రంగా చేసుకుని మార్కెటింగ్ కార్యకలాపాలు నిర్వహించాలని తెలిపారు. ఇతర రాష్ట్రాలకు చేపల ఎగుమతి చేసేందుకు ఎటువంటి అవాంతరాలు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
చంద్రయాన్-2 వైఫల్యంపై పాక్ మంత్రి అనుచిత వ్యాఖ్యలు