telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“కేజిఎఫ్-2” విడుదల తేదీ మారనుందా ?

kgf

ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌లలో “ఆర్ఆర్ఆర్” అనే భారీ బ‌డ్జెట్ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో చ‌ర‌ణ్ స‌ర‌స‌న క‌థానాయిక‌గా అలియా భ‌ట్‌, ఎన్టీఆర్‌కి జోడీగా ఓలివియా మోరిస్‌పై స‌నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం విడుదల ఆలస్యం కావొచ్చు అంటూ వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. తాజాగా “ఆర్ఆర్ఆర్” ఈ చిత్రాన్ని 2021, జనవరి 8న విడుదల చేస్తున్నట్లు చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. అయితే ఈ సినిమా విడుదల అనూహ్యంగా వాయిదా పడటంతో చాలా సినిమాల రిలీజ్ డేట్స్ లో మార్పులు జరుగుతున్నాయి. ‘ఆర్ఆర్ఆర్‌’ మూవీ విడుదల వాయిదా పడడంతో మరో పాన్ ఇండియా మూవీ ‘కె.జి.య‌ఫ్ 2’ ఈ అవకాశాన్ని క్యాష్ చేసుకోవాలని భావిస్తోంది. తెలుగు నుంచి ‘బాహుబలి’ తరహాలోనే కన్నడ నుంచి ‘కె.జి.య‌ఫ్ 1’ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో ప్రభంజనం సృష్టించింది. ప్రస్తుతం రెండో పార్టు సిద్ధమవుతోంది. యశ్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ మోస్ట్ అవెయిటెడ్ మూవీకి ఇప్పటివరకూ అధికారికంగా విడుదల తేదీని ప్రకటించలేదు. ఇప్పుడు ‘ఆర్.ఆర్.ఆర్’ తప్పుకోవడంతో.. అదే తేదీన ‘కె.జి.ఎఫ్-2’ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట చిత్ర నిర్మాతలు. మరి ఇందులో నిజమెంతుందో తెలియాలంటే చిత్రబృందం అధికారికంగా సినిమా విడుదల తేదీని ప్రకటించే వరకు ఎదురు చూడాల్సిందే.

Related posts