telugu navyamedia
తెలంగాణ వార్తలు

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఆరోపణలు : నాకు ఎలాంటి సంబంధం లేదు..ఏ విచార‌ణ‌కైనా నేను సిద్ధం

*ఢిల్లీ లిక్కర్ పాలసీ తో నాకు ఎలాంటి సంబంధం లేదు..
*ఎలాంటి విచార‌ణ‌కైనా నేను సిద్ధం..
*ఇలాంటి ఆరోప‌ణ‌లు నిరంత‌రం చేస్తూనే ఉన్నారు..
*నిరాధార ఆరోపణలు చేస్తే సహించేది లేదు

ఢిల్లీ లిక్కర్ పాలసీ తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తోంది. లిక్కర్‌ పాలసీ కుంభకోణంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బీజేపీ నాయకులు టీఆర్‌ఎస్‌ పైన, తెలంగాణ సీఎం కేసీఆర్‌ కుమార్తె కవితపైన డైరెక్ట్‌ ఎటాక్‌ చేశారు. కేసీఆర్‌ కుటుంబ సభ్యుల ప్రమేయం ఉన్నట్లు ఆరోపిస్తున్నారు.

ఈ కుంభకోణం వెనుక కవిత హస్తం ఉందని.. మద్యం వ్యాపారంలో కమీషన్ల కోసమే ఆమె ఈ కుంభకోణంలో వ‌చ్చార‌ని బీజేపీ ఎంపీ పర్వేశ్‌ వర్మ అన్నారు. కేసీఆర్‌ కుటుంబ సభ్యుల సలహా మేరకే ఢిల్లీ మద్యం విధానం రూపొందిందని.. ఈ విధానం రూపకల్పనకు సంబంధించిన భేటీలకు వారు కూడా హాజరయ్యారని ఆరోపించారు

దీనిపై స్పందించారు నిజామాబాద్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు..ఢిల్లీలో లిక్కర్ స్కాంకి తనకు ఎలాంటి సంబధం లేదని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. బీజేపీ నేతలు తనపై చేసిన ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని చెప్పారు.

దేశవ్యాప్తంగా ఉన్న ప్రతికపక్ష పార్టీల మీద అధికారిక బీజేపీ కక్షపూరిత రాజకీయాలు జరుగుతున్నాయని అన్నారు. నిరాధారంగా ఏది పడితే అది మాట్లాడటం ప్రజాస్వామ్యంలో మంచి పద్దతి కాదన్నారు ఎమ్మెల్సి కల్వకుంట్ల కవిత. బీజేపీ నేతలు ఆరోపిస్తున్నట్టుగా ప్రస్తుత అంశంలో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు.

కేసీఆర్ కూతురు కాబట్టే తనపైన ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. కేసీఆర్ బిడ్డను బద్నాం చేస్తే, కేంద్ర ప్రభుత్వంపై పోరాడుతున్న కేసీఆర్ భయపడాతారని బీజేపీ నాయకులు అనుకుంటున్నట్లు కవిత స్పష్టం చేశారు.

కానీ అలాంటి వాటికి తాము అస్సలే భయపడం అని.. ఇలాంటి ఎన్ని ప్రయత్నాలు చేసిన అన్నీ వ్యర్థమేనని వ్యాఖ్యానించారు.

వారి చేతిలోనే అన్ని దర్యాప్తు సంస్థలు ఉన్నాయని.. వారికి ఎటువంటి విచారణ కావాలన్న చేసుకోవచ్చని కవిత చెప్పారు. తాను విచారణకు సహకరిస్తానని తెలిపారు.

తెలంగాణ కోసం ఉద్యమించిన అన్ని సంవత్సరాలలో, తమ కుటుంబ సభ్యుల మీద అనేక ఆరోపణలు చేసినా, మొక్కవొని ధైర్యంతో, మడమ తిప్పకుండా ప్రజల పక్షాన నిలబడ్డామన్నారు. భారతదేశం ఎలా అభివృద్ధి చెందాలి అనే కలతో, ఎజెండాతో సీఎం కేసీఆర్ ముందుకెళ్తున్నారని కవిత తెలిపారు.

బిల్కిస్‌ బానో, ఇతర అంశాలపై కేంద్రాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని కవిత స్పష్టం చేశారు. బిల్కిస్ బానో, ఉద్యోగాలు లాంటి విషయాలపై జవాబు చెప్పకుండా, ప్రతిపక్షాల మీద ఇలాంటి ఆరోపణలతో బురద చల్లాలనే వైఖరి బాగాలేదని విమర్శించారు.

అంతేకాకుండా ఢిల్లీ మద్యం విధానంలో తనపై తప్పుడు ఆరోపణలు చేసినందుకుగాను ఢిల్లీ బీజేపీ నేతలపై పరువు నష్ట దావా వేయనున్నాట్లు ఎమ్మెల్సీ కవిత తెలిపారు. బీజేపీ ఎంపీ పర్వేష్ వర్మ, మాజీ ఎమ్మెల్యే మంజిందర్ సిర్సాపై పరువు నష్టం దావా వేస్తానని అన్నారు. నిరాధార ఆరోపణలు చేసినందుకు వ్యతిరేకంగా ఇంజక్షన్ ఆర్డర్ ఇవ్వాలని కూడా కోర్టును అశ్రయించబోతున్నట్లు ప్రకటించారు. ఈ విషయంపై ఇప్పటికే న్యాయ నిపుణులతో చర్చలు కూడా జరిపారు

Related posts