telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

అపోలో ఆసుపత్రిలో నాయిని..మంత్రి కేటీఆర్ పరామర్శ

తెలంగాణ మాజీ హోం శాఖ మంత్రి నాయిని నరసింహారెడ్డి ఆరోగ్యం విషమించింది. ప్రస్తుతం ఆయన జూబ్లీహిల్స్‌ అపోలో ఆసుపత్రిలోని అడ్వాన్స్‌డ్‌ క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌లో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. గత నెల 28వ తేదీన కరోనా బారినపడ్డ నాయిని బంజారాహిల్స్‌లోని సిటీ న్యూరో సెంటర్‌ ఆసుపత్రిలో చేరి 16 రోజులు చికిత్స పొందారు. ప్రస్తుతం ఆయన ఊపిరితిత్తుల సమస్యతో బాధ పడుతున్నారు. అయితే.. అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి నాయిని నర్సింహా రెడ్డిని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పరామర్శించారు. నాయిని నర్సింహా రెడ్డి ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకొని, మెరుగైన వైద్యం అందించాలని మంత్రి కేటీఆర్ కోరారు. ప్రస్తుతానికి నాయిని నర్సింహారెడ్డి అత్యవసర చికిత్స అందిస్తున్నారని… ఆయన కోలుకొని వస్తారని ఆశిస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. అంతేకాదు వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. కాగా..నిన్ననాయిని నర్సింహా రెడ్డిని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, కర్నే ప్రభాకర్ పరామర్శించారు.

Related posts