telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ప్రధాని, సీఎం కేసీఆర్ ఎందుకు వాక్సిన్ తీసుకోవడం లేదు : ఉత్తమ్

కోవిడ్ 19 వాక్సిన్ పై ప్రజల్లో అనుమానం ఉంటే ప్రధాని, సీఎం ఎందుకు వాక్సిన్ తీసుకోవడం లేదని ప్రశ్నిస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ… తెలంగాణ బీజేపీ నేతలు రోజు మాట్లాడే…కేసీఆర్ అవినీతిపై కేసులు పెండింగ్ ఉన్నాయా..? అని క్వశ్చన్‌ అవర్ లో అడుగుతామన్నారు. కాళేశ్వరం, మిషన్ భగీరథ అవినీతిపై విచారణ చేయాలని పార్లమెంటులో ప్రస్తావిస్తామని తెలిపారు. ప్రజల్లో అనుమానాలు రాకుండా పాలకులు వాక్సిన్ ఎందుకు తీసుకోవడం లేదని నిలదీస్తామన్నారు. టీఆరెస్, బీజేపీ చీకటి ఒప్పందం ఢిల్లీ వేదికగా బయటపెడుతామని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. హైదరాబాద్-విజయవాడకు బుల్లెట్ ట్రైన్, తెలంగాణ విభజన చట్టం వెంటనే అమలు చేయాలని పార్లమెంటులో కేంద్రాన్ని డిమాండ్ చేస్తామని వెల్లడించారు. ఐటీఐఆర్ ప్రాజెక్టు హైదరాబాద్ ఎందుకు రావడం లేదని నిలదీస్తామన్నారు. మైనార్టీ , గిరిజన రిజర్వేషన్ల పై పార్లమెంటులో అడుగుతామని పేర్కొన్నారు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి. తెలంగాణ రాష్ట్ర ప్రాజెక్టులపై డిపిఆర్ ఇవ్వలేదని కేంద్రం ప్రశ్నిస్తుందని…ఎందుకు కేంద్రం డిపిఆర్ లు ఇవ్వనున్న అప్పులు ఎలా ఇస్తున్నారో కేంద్రాన్ని అడుగుతామన్నారు.

Related posts