telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ కు తండ్రిగా ప్రమోషన్…!!

Sriram-Aditya

టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య భార్య పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ సందర్భంగా తండ్రిని అయ్యానంటూ ఈ విషయాన్ని స్వయంగా శ్రీరామ్ సోషల్ మీడియా వేదికగా తెలిపాడు. దీంతో ఆయనకు నెటిజన్లు, సెలెబ్రిటీలు అభినందనలు తెలియజేస్తున్నారు. ఇక ప్రస్తుతం సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా పరిచయమవుతున్న సినిమాకి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నాడు. అమరరాజా మీడియా అండ్ ఎంటర్టైన్ మెంట్ బ్యానర్ పై పద్మావతి గల్లా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో హీరోయిన్ గా ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ నటిస్తోంది. కాగా సుధీర్‌బాబు న‌టించిన “భ‌లే మంచి రోజు” సినిమాతో దర్శకునిగా పరిచయమైన శ్రీరామ్ తరువాత నలుగురు హీరోలతో “శ‌మంత‌క‌మ‌ణి” అనే సినిమా తీశారు. ఆ సినిమా హిట్ కావడంతో కింగ్ నాగార్జున‌, నేచుర‌ల్ స్టార్ నాని వంటి హీరోలతో కలిసి ‘దేవ‌దాస్’ అనే సినిమాను తెరకెక్కించారు. కానీ అది ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు.

Related posts