telugu navyamedia
సినిమా వార్తలు

దుమ్ము రేపుతున్న ‘ఆచార్య’ లాహె లాహె సాంగ్‌ ..!

 బ్లాక్ బస్టర్ చిత్రాల దర్శకుడు కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన సినిమా ఆచార్య‌. కొద్ది రోజుల క్రితం ఈ సినిమా నుండి లాహె లాహె అనే లిరిక‌ల్ సాంగ్ వీడియో విడుద‌లైన సంగతి తెలిసిందే. ఇటీలవ ఈ మూవీలోని ‘లాహే లాహే’ అనే లిరిక‌ల్ సాంగ్ వీడియో విడుద‌లై సోషల్‌ మీడియాలో వైరల్‌ మారింది.

Chiranjeevi Acharya Lahe Lahe Song Telugu Lyrics - Sakshi

మెగాస్టార్ చిరంజీవి కు  గతంలో ఎన్నో మ్యూజికల్ హిట్స్ అందించిన సంగీత దర్శకుడు మణిశర్మ కాంబినేష‌న్‌లో వచ్చిన ఈ సాంగ్.. ఏకంగా 80 మిలియన్ల‌ వ్యూస్‌ను క్రాస్ చేసి ఈ పాట దూసుకు పోతోంది. ఈమధ్య కాలంలో ‘సారంగ దరియా…’ సాంగ్ తర్వాత అత్యధిక వ్యూస్‌ను దక్కించుకున్న పాటగా ‘లాహె లాహె…’ నిలిచి య్యూటూబ్‌లో దుమ్ము రేపుతుంది.

త్వ‌ర‌లోనే ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాలో మెగా ప‌వ‌ర్‌స్టార్‌ రామ్‌చరణ్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. కాజల్, పూజా హెగ్డేలు హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో చిరు, చరణ్‌లు నక్సలైట్‌లుగా నటిస్తున్నారని టాక్. ఆచార్య సినిమాను నిరంజన్‌ రెడ్డి, రామ్‌చరణ్‌ నిర్మిస్తున్నారు. ఆచార్య మూవీపై ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు మొద‌లైయ్యాయి. చిరంజీవి, రాంచరణ్ మాస్ లుక్స్‌తో అభిమానులను ఎంత‌గానో ఆకట్టుకుంటున్నారు. 

Related posts