telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

శ్మ‌శానాలపై పూరీ ఆసక్తికర వ్యాఖ్యలు

Puri

సమాజంలో ప్రజలకు ఎదురవుతోన్న, అనుభవిస్తోన్న పలు ముఖ్యమైన అంశాలపై ఇప్పటికే పోడ్‌కాస్ట్‌లు వదిలిన పూరి… తాజాగా ‘పూరీ మ్యూజింగ్స్’ అంటూ తన వాయిస్ ఓవర్‌తో ఆడియోలను విడుదల చేస్తున్నారు. తాజాగా గ్రేవ్ యార్డ్స్ (శ్మ‌శానం) గురించి ప్రస్తావించారు. ఇందులో శ్మశానాల గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. “ఒక ఊర్లో ఓ ముస‌లాడు ఉండేవాడు. వాడి పేరు అన్ బిలివ‌బుల్‌. వాడు చ‌నిపోతూ మా నాన్న ‘నాకీ పేరు ఎందుకు పెట్టాడో తెలియదు. జీవితాతం వినీ వినీ చిరాకొచ్చింది. అంద‌రూ నాపై జోక్‌లేసేవాళ్లే. ద‌య‌చేసి నా స‌మాధిపై పేరు మాత్రం రాయొద్దు. రాస్తే ప్రతి ఒక్కరూ వచ్చి అన్ బిలీవబుల్ అని నవ్వుతారు. అది నేను తట్టుకోలేను’ అన్నాడు. పాపం ముసలావిడ మొగుడు చెప్పినట్లే అతని పేరు రాయలేదు. కానీ సమాధిపై ‘నా మొగుడు బంగారం. న‌న్ను త‌ప్ప మ‌రో ఆడ‌దాన్ని క‌న్నెత్తి కూడా చూడ‌లేదు’ అని త‌న మ‌న‌సులో మాటను రాసింది. ఆరోజు నుండి ప్ర‌తి ఒక్క‌రూ వ‌చ్చి అది చ‌దివి అన్ బిలివ‌బుల్ అని న‌వ్వుకుంటూ వెళ్లిపోవటం జ‌రిగేది. దాంతో అన్ బిలివ‌బుల్‌గారి ఆత్మ శాంతి లేకుండా పోయింది. చచ్చిపొతే శ‌వాన్ని పాతిపెట్ట‌డం నేర్చుకుంది ల‌క్ష సంవ‌త్స‌రాల క్రితం. అప్ప‌టి నుండి గ్రేవ్ యార్డ్స్ మొద‌ల‌య్యాయి. పురాత‌న గ్రేవ్‌యార్డ్ మొరాకోలో ఉంది. దాని వ‌య‌సు ప‌దిహేను వేల సంవ‌త్స‌రాలు. దీన్నే సిమెట్రి అని కూడా అంటాం. సిమెట్రి అంటే నిద్ర‌పొయే స్థ‌లం అని అర్థం. క‌ఫిన్ బాక్స్ అంటే మినిమం ఆర‌డుగుల గొయ్యి త‌వ్వాల‌నే నియమం పెట్టుకున్నారు. ఎందుకంటే పూర్వం ప్లేగులాంటి వ్యాధితో చనిపోయేవారు. ఆ వ్యాధి ప్ర‌బ‌ల‌కుండా ఉండాల‌ని ఆరడుగుల నియ‌మాన్ని పెట్టుకున్నారు. స‌మాధుల‌పై రాసే రాత‌ల‌ను ఎపిటాప్స్ అంటారు.

యూర‌ప్‌లో ప్ర‌తి శ్మ‌శానం వ‌ద్ద ఓ ఆఫీస్ ఉంటుంది. ముస‌లాళ్లంద‌రూ అక్క‌డకెళ్లి ప్యాకేజీ తీసుకుంటారు. వాళ్లు చ‌నిపోతే వాళ్ల‌ని ఎలాంటి క‌ఫిన్‌లో పాతిపెట్టాల‌నే డిజైన్స్‌ను సెల‌క్ట్ చేసుకుంటారు. స‌మాధికి ఎంత స్థ‌లం కావాలి? ఏం రాయాలి? ఎలాంటి స్టాట్యు పెట్టాలి? అని సెల‌క్ట్ చేసుకుంటారు. అంతే కాకుండా వారి ఫ్రెండ్స్ అంద‌రి పేర్లు, ఫోన్ నెంబ‌ర్స్ ఇచ్చి.. త‌ను చ‌నిపోయిన త‌ర్వాత స్నేహితులంద‌రినీ పిలిచి ఆల్క‌హాల్‌తో స‌హా ఎంత పెద్ద పార్టీ ఇవ్వాలి. అని ముందు డ‌బ్బులు చెల్లించేసి వెళ్లిపోతారు. వాళ్లు చ‌నిపోయిన త‌ర్వాత ఆఫీసువాళ్లు అదే చేస్తారు. నేను ఓ రోజు అలాంటి గ్రేవియార్డ్ ఆఫీసులో కూర్చున్నాను. ఓ ముస‌లి దంప‌తులు వ‌చ్చి న‌వ్వుతూ అక్క‌డే ఉండి అన్నీ సెల‌క్ట్ చేసుకుని వెళ్లారు. నాకెంతో ముచ్చ‌టేసింది. చావు గురించి ఆలోచించ‌డం ఎంతో అశుభంగా ఫీల్ అవుతాం. విదేశీయులేమో జీవితాన్ని విజిటింగ్‌.. సెండాఫ్‌గా చూస్తారు. నేను స్పెయిన్‌, పోర్చుగ‌ల్‌లో పెద్ద పెద్ద గ్రేవ్ యార్డ్స్‌ను చూశాను. ఆ ప్ర‌దేశాలెంత బావుంటాయంటే అక్క‌డే కూర్చోవాల‌నిపిస్తుంది. రెండు గ్రేవ్ యార్డ్స్‌లో రాత్రి ప‌డుకోవ‌డానికి ట్రై చేశాను. వాళ్లు నాకు ప‌ర్మిష‌న్ ఇవ్వ‌లేదు. స‌మాధుల‌పై రాసిన రాత‌ల‌ను చ‌దువుతూ తిర‌గ‌డం నాకు ఇష్టం. అవెంతో ఫ‌న్నీ, ఇంట్ర‌స్టింగ్‌గా అనిపిస్తాయి. ఓ స‌మాధిపై బై అని, మ‌రోదానిపై సీ యు సూన్ అని ఉంటాయి. ఓ స‌మాధిపై ‘నువ్వు భ‌ర్త‌, తండ్రివి.. కానీ బ్యాడ్ ఎల‌క్రిషియ‌న్‌వి అని వాళ్ల పిల్లలు రాశారు. మ‌రో స‌మాధిపై ‘నాకు తెలుసు ఇలా జరుగుద్ది అని’. అన్నింటికంటే హైదరాబాద్‌లోని ఓ క్రిస్ట్రియ‌న్ శ‌శ్మానంలో రాసిన ఎపిటాప్ నాకు బాగా ఇష్టం. ఏమీ రాసుందో అని తొంగి చూశాను. దానిపై ‘నేను నీలా ఒక‌ప్పుడు స‌మాధుల వైపు ఇలా తొంగి చూసేవాడిని అని రాసుంది” అంటూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

 

View this post on Instagram

 

‪👉 https://youtu.be/pAtdbOD3NFo @charmmekaur #PC

A post shared by Puri Connects (@puriconnects) on

Related posts