telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

మూడో విడత పంచాయితీ ఎన్నికల్లో 11. 9శాతం పోలింగ్..

ఏపీలో ప్రస్తుతం పంచాయితీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. అక్కడ పార్టీలు అని దీని పైనే దృష్టి పెట్టాయి. అయితే ఈ పంచాయతీ ఎన్నికలు సగం పూర్తి అయ్యాయి. అంటే రెండు విడతల ఎన్నికలు పూర్తి కాగా మూడో విడత ఎన్నికల కోసం సిద్దం అవుతున్నారు. ఇవాళ జరిగే మూడోదశ పోలింగ్‌కు జోరుగా ఏర్పాట్లు జరిగాయి. మూడో విడతలో మొత్తం 13 జిల్లాల్లోని 20 రెవెన్యూ డివిజన్లు, 160 మండలాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తంగా చూస్తే మూడోవిడతలో 3 వేల 221 పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక మూడో విడత ఉదయం 8.30 కి పంచాయితీ ఎన్నికల్లో 11. 9శాతం పోలింగ్ జరిగింది. గుంటూరులో అత్యధికంగా పోలింగ్‌ జరుగగా.. ప్రకాశంలో అత్యల్ప పోలింగ్ జరిగింది.

జిల్లాల వారీ పోలింగ్..

శ్రీకాకుళం 12.87

విజయనగరం 15.30

విశాఖ 13.75

ఈస్ట్ గోదావరి 14.63

వెస్ట్ గోదావరి 11.72

కృష్ణా 8.14

గుంటూరు 18.83

ప్రకాశం 8.04

నెల్లూరు 9.1

చిత్తూరు 9.34

కడప 7.57

కర్నూలు 15.39

అనంతపురం 9.97

Related posts