telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

ఏడాది పాటు పైసా ఖర్చు లేకుండా గడిపేసిన టీచర్.. ఎలాగంటే ?

Teacher

ఎలెని అనే ఓ 22 ఏళ్ల టీచర్ ఆస్ట్రేలియాలోని అడిలైడ్‌లో ఉంటోంది. ఆన్‌లైన్లో హ్యాపీ హౌస్ సిట్టర్స్, ద హౌస్ సిట్టర్స్ అనే రెండు వెబ్‌సైట్లు చూసిన ఆమె.. వాటిలో జాయిన్ అయింది. వీటిలో చేరడానికి ఆమెకు రూ.5వేలు ఖర్చయ్యాయి. అంతే.. ఆ తర్వాత సెల్ఫీ దిగి, తన ప్రొఫైల్ క్రియేట్ చేసుకుంది. ఆ తర్వాత ఊళ్లకు వెళ్లే బడా బడా ఇంటి యజమానులు.. తమ ఇల్లు చూసుకోవాలంటూ ఆమెకు మెయిల్స్ పంపారు. వాటిని ఎంచుకొని యజమానులు లేని సమయంలో వారి ఖరీదైన ఇళ్లలో దర్జాగా గడిపేసింది ఎలెని. ఈ ఉద్యోగాలు సాధారణంగా రెండు వారాల నుంచి రెండు నెలల వరకూ ఉంటాయని ఆమె చెప్పింది. ఓసారి ఒక అందమైన బీచ్ హౌస్‌లో రెండు నెలలు గడపాల్సి వచ్చిందని, తన కోసం ఆ ఇంటి యజమాని పెద్దమొత్తంలో రెడ్‌వైన్ సిద్ధం చేశాడని గుర్తు చేసుకుంది. అంతేగాక పని పూర్తయ్యాక 500 డాలర్ల (రూ.35 వేలపైగా) చెక్కు అందుకున్నట్లు తెలిపింది. సాధారణంగా ఇలా హౌస్ సిట్టర్స్‌ను ఎంచుకునే యజమానులు ఇంట్లో ఫ్రిజ్‌ను పూర్తిగా నింపేస్తారని, ఆహారానికి ఇతర అవసరాలకు అస్సలు కొరత ఉండదని చెప్పింది ఆమె.

Related posts