telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

రాజ్యాంగానికి వ్యతిరేకంగా గవర్నర్ నిర్ణయం: అయ్యన్న

Ayyannapatrudu tdp

మూడు రాజధానుల నిర్ణయాన్ని జగన్ రెడ్డి చెంచాలు మినహా ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నారని టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు అన్నారు. మూడు రాజధానుల మాట మీరు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు.

మూడు రాజధానులకు ఆమోదం తెలుపి, శ్రావణ శుక్రవారం రోజున ఆడపడుచులచే కన్నీళ్లు పెట్టించారని అన్నారు. ఆ పాపం ఊరికే పోదని మండిపడ్డారు. ఆడ వాళ్లను బాధపెట్టిన వాళ్లు సర్వనాశనం అయిపోతారని హెచ్చరించారు.

గుంటూరు, కృష్ణ జిల్లా ఎమ్మెల్యేలందరూ రాజధాని ఇక్కడే ఉంటుందని చెప్పిన మాట వాస్తవం కాదా అని మండిపడ్డారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా గవర్నర్ నిర్ణయం తీసుకున్నారని అన్నారు. గవర్నర్ ఇటువంటి నిర్ణయంతీసుకున్నారంటే ఆయన వెనకాల ఎవరి ప్రోత్బలం ఉందో ప్రజలు ఆలోచించాలని తెలిపారు. సోమువీర్రాజు బీజేపీ అధ్యక్షుడు అయినప్పుప్పటి నుంచి రాజధాని విషయంలో పూటకో మాట మాట్లాడారని మండిపడ్డారు.

Related posts