telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఇష్ట ప్రకారం ఏకపక్షంగా నిర్ణయాలు..ప్రభుత్వం పై చంద్రబాబు ఫైర్

chandrababu

మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో నిన్న కరోనా కేసులు అత్యధికంగా కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఘాటుగా స్పందించారు. ఈ రోజు హైదరాబాద్‌లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ వైరస్‌తో దేశంలో ఇప్పటికే 590 మంది మృతి చెందారని చంద్రబాబు తెలిపారు. ‘రాష్ట్రంలో నిన్న నిన్న కేసులు పెరిగాయి. అన్ని రాజకీయ పార్టీలతో ఓ సమావేశం నిర్వహించండి. చాలా సార్లు ప్రభుత్వానికి ఈ విషయం చెప్పాం. ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మీ ఇష్ట ప్రకారం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు.. ఇది ఒక రాష్ట్రానికే సంబంధించిన విషయం కూడా కాదు.. ప్రజల ప్రాణాలకు సంబంధించిన విషయం. ప్రజలు బతికితేనే మనం రాజకీయాలు చేస్తాం.. వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. కరోనా విజృంభణ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న లాక్‌డౌన్‌ చాలా మంచి నిర్ణయమనిఅన్నారు. . 14 రోజుల నుంచి 25 రోజుల్లోగా ఎప్పుడైనా వైరస్ బయట పడుతుందని చెప్పారు.

Related posts