telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

మే నెల‌లోగా ప‌ది ల‌క్ష‌ల ఆర్‌టీపీసీఆర్ కిట్లు: ల‌వ్ అగ‌ర్వాల్

Janatha carfew AP cader IAS Officer

దేశవ్యాప్తంగా 19 రాష్ట్రాల్లో వైర‌స్ రెట్టింపు స‌గ‌టును జాతీయ స్థాయి క‌న్నా త‌క్కువ‌గా ఉన్న‌ట్లు కేంద్ర ఆరోగ్య‌శాఖ సంయుక్త కార్య‌ద‌ర్శి ల‌వ్ అగ‌ర్వాల్ తెలిపారు. ఈ రోజు ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ జాతీయ స్థాయిలో వైర‌స్ వృద్ధి రేటు 40 శాతం ప‌డిపోయిన‌ట్లు ఆయ‌న తెలిపారు. మొత్తం కేసుల్లో 80 శాతం కేసులు కోలుకున్నాయ‌ని, మ‌రో 20 శాతం కేసుల్లో మ‌ర‌ణాలు సంభ‌వించిన‌ట్లు అగ‌ర్వాల్ చెప్పారు.

గ‌త 24 గంట‌ల్లో 23 మంది మ‌ర‌ణించారని తెలిపారు. దేశ‌వ్యాప్తంగా 1007 కొత్త కేసులు నమోదైనట్టు వెల్లడించారు. కోవిడ్19 వ్యాక్సిన్‌ను వీలైనంత వేగంగా అభివృద్ధి చేస్తామ‌న్నారు. బీసీజీ, మోనోక్లోన‌ల్ యాంటీబాడీస్‌తో వైర‌స్‌ను జ‌యించే వ్యాక్సిన్‌ను త‌యారు చేసేందుకు ప‌నిచేస్తున్న‌ట్లు చెప్పారు. మే నెల‌లోగా సుమారు ప‌ది ల‌క్ష‌ల ఆర్‌టీపీసీఆర్ కిట్ల‌ను త‌యారు చేయ‌నున్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. 

Related posts