తాజాగా దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా నాని చెప్పిన విషెస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అది చూసిన వాళ్లు అసలు ఇలా కూడా బర్త్ డే విషెస్ చెప్తారా నాని గారూ అంటూ అడుగుతున్నారు. ఈయన్ని ఇండస్ట్రీకి పరిచయం చేసింది ఇంద్రగంటే. 12 ఏళ్ల కింద అష్టా ఛమ్మా సినిమాతో వచ్చాడు నాని. ఆ తర్వాత జెంటిల్ మెన్ సినిమా చేసాడు ఈయనతో. ఈ రెండు కూడా మంచి విజయం సాధించాయి. ఇప్పుడు తన 25వ సినిమా వి కూడా ఈయనతోనే చేసాడు. ఉగాదికి రావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా రాలేదు. ఇదిలా ఉంటే ఎప్రిల్ 17న ఇంద్రగంటి పుట్టిన రోజు సందర్భంగా తన 50వ సినిమా మీరు చేయాలి.. మీ 25వ సినిమా నేను చేస్తాను.. హ్యాపీ బర్త్ డే మోహన్ సర్ అంటూ ట్వీట్ చేసాడు నాని. ప్రస్తుతం వరస సినిమాలతో బిజీగా ఉన్నాడు నాని. కరోనా కారణంగా వి సినిమా వాయిదా పడిన సంగతి తెలిసిందే.
మోహన్ సర్…
నా 50th మీరే చేయాలి…
మీ 25th నేనే చేయాలి ….🙃Wish you a very very happy birthday at home @mokris_1772 sir #V will celebrate soon ✌🏼 pic.twitter.com/ohnz0c5juW
— Nani (@NameisNani) April 17, 2020