telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

ఇక చాలు ఆఫీసులకు వచ్చేయండి…

ప్రపంచాన్ని వణికించిన కరోనా కారణంగా చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు ఇంటి నుండి పని చేసే వెసులుబాటు కల్పించాయి. గూగుల్ ఫేస్ బుక్ వంటి సంస్థలు వచ్చే ఏడాది వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చాయి. టాటా స్టీల్ కూడా వైట్ కాలర్ ఉద్యోగులకు తాజాగా వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ ఇచ్చింది. ప్రముఖ ఐటీ సంస్థలు  కూడా ఉద్యోగులకు ఇంటి నుండి పనిని పొడిగించింది. ఈ కొన్ని సంస్థలే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా పలు ఐటీ సంస్థలు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చాయి.  కొన్ని దేశాల్లో కరోనా మహమ్మారి జోరు తగ్గుతూ ఉండటంతో కొద్ది కొద్దిగా ఆఫీసులు తెరచి ఉద్యోగుల్ని ఆఫీసులకి పిలుస్తున్నారు. కరోనా లాక్ డౌన్ సమయంలో వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చిన వారికీ ఒక్కొక్కరిగా ఫోన్స్ వస్తున్నాయి. ఎవరికైనా ఇంట్లో నుండి పని చేయలేకపోతుంటే అటువంటి వారిని ఆఫీసుకు రమ్మని చెప్తున్నారు. అయితే కొన్ని ప్రముఖ ఐటీ సంస్థలు వచ్చే ఏడాది వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చాయి. అటువంటి సంస్థలు కూడా ముందుగానే తమ ఉద్యోగులకి సమాచారం ఇచ్చి ఆఫీసులకి రావడానికి సిద్ధం చేస్తున్నాయి. అయితే ఐటీ సంస్థల్లో చాలా ప్రముఖ సంస్థలు అన్ని కూడా అమెరికా భారత్ లోనే ఉన్నాయి. ఉద్యోగుల ఆరోగ్యం భద్రతకి ప్రాముఖ్యత ఇస్తూనే కరోనా నియమాలు పాటిస్తూ రోజురోజుకి ఆఫీసులకి వచ్చే వారి సంఖ్యను పెంచేలా ప్రణాళికలు వేస్తున్నారు. అలాగే దేశంలోని ఇతర కంపెనీలు కూడా తమ ఉద్యోగులకి ఆఫీసులకి రావడానికి సిద్ధం కావాలని ఇప్పటికే చెప్పాయి.

Related posts